డయాబెటిస్ ఉన్నవారు ఈ ఫుడ్ తీసుకుంటే – షుగర్ కంట్రోల్ లో ఉంటుంది

Health Tips for Diabetes patients

0
102

డయాబెటిస్ ఉన్నవారు ఏ ఫుడ్ తీసుకోవాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ షుగర్ పెరుగుతుందా అనే భయం ఉంటుంది. అందుకే వారు తీసుకునే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు తీసుకునే ఆహారం మీ శరీరంలోని ఇన్సులిన్ పై ప్రభావం చూపిస్తుంది.

షుగర్ ఉన్న వారు భోజనంలో అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్స్ అన్నీ శరీరానికి అందేలా చూసుకోవాలి. పచ్చని ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. అయితే అన్ని రకాల పండ్లు తీసుకోకూడదు. ఎందుకంటే షుగర్ లెవల్స్ కొన్ని పండ్ల వల్ల పెరుగుతాయి. ఈ ఫుడ్ తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయంటున్నారు నిపుణులు. సో మరి ఆ ఫుడ్ ఏమిటో చూద్దాం.

మితంగా వారానికి ఓసారి అయినా బీట్ రూట్ తీసుకోండి.రెండు రోజులకి ఓసారి టమోటా తీసుకోవచ్చు

అవిసె గింజలు ,ఓట్స్ ,రాగిపిండి, రాగిజావ,సజ్జలు, జొన్నలు మంచివే ,గుమ్మడికాయ విత్తనాలు, బార్లీ ,
బెర్రీలు వారానికి ఓసారి తీసుకోవచ్చు ప్రతీ రోజూ తీసుకోకూడదు.
మెంతులు
జామ కాయ.