ఈ కరోనా వచ్చిన తర్వాత మనలో చాలా మంది ఇమ్యునిటీ పవర్ ని పెంచుకునేలా ఫ్రూట్స్ తీసుకుంటున్నారు.. వాటి నుంచి మనకు ఏ పోషకాలు లభిస్తున్నాయో కచ్చితంగా తెలుసుకోవాలి. మేలు చేసే పండ్లల్లో సపోటా కూడా ఒకటి, మరి సపోటా తినడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
సపోటాల్లో చాలా ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. సపోటా తినడం వల్ల గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు పోషకాలు త్వరగా అందుతాయి. ఇక అధిక బరువు సమస్య ఎవరికైనా ఉంటే వారు సపోటా తీసుకోవచ్చు. శరీరంలో కొవ్వును సైతం కరిగిస్తుంది. ఇక జుట్టు సమస్యలు చుండ్రు సమస్యలు ఉంటే తగ్గుతాయి.
సపోటా తింటే విటమిన్-A పుష్కలంగా లభిస్తుంది. ఇక కంటి చూపు బాగా మెరుగు అవుతుంది. అంతేకాదు ఇమ్యునిటీ పవర్ పెంచడంలో సపోటా ఉత్తమ ఫలం. ఇక శరీర ఛాయ బాగుంటుంది. అంతేకాదు వృద్దాప్య ఛాయలు రావు, ముఖం పై ముడతలు రావు.