Horse Grams: ఉలవచారుతో బాన పొట్టకు చెక్‌

-

Horse Gram Benefits: ఏంటో ఇంత తిన్నా.. పొట్ట బానలా పెరుగుతూనే ఉంది.. ఎంత వ్యాయామం చేస్తున్నా.. డైట్‌ ఫాలో అవుతున్నా, పొట్ట మాత్రం తగ్గటం లేదని బాధపడుతున్నారా..? అయితే ఇది మీకోసమే. రోజూ ఆహారంలో ఉలవచారును భాగం చేసుకుంటే, పొట్టతో పాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు (belly fat and body fat)ను కూడా తగ్గించేస్తుంది. ఉలవలు తినటం ద్వారా ఊబకాయం సైతం తగ్గుతూ వస్తుంది. ఉలవచారు సూప్‌లో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకొని, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తింటే, శరీరానికి కావాల్సిన పోషకాలు, కొవ్వు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

- Advertisement -

ఉలవలలో (horse grams) ఐరన్‌, కాల్షియం ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో, వ్యాయామం చేసిన తరువాత ప్రొటీన్ల షేక్స్‌ బదులుగా.. ఉలవ సూప్‌ను తాగొచ్చు. ఉలవ చారుతో పొత్తికడుపులో పేరుకుపోయిన అనవసర ఫ్యాట్‌ను కూడా అదుపులో పెట్టవచ్చు. ఉలవచారు తినటంతో ఆకలి తగ్గుతుంది. దీనివల్ల తరుచుగా చిరు తిళ్లు తినటం తగ్గి.. డైట్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఉలవలు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ పెరుగేందుకు దోహదం చేస్తుంది. ఉలవ సూప్‌ గుండె ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తారు. పైగా చలికాలంలో ఉలవలు తీసుకోవటం ద్వారా, శరీరంలో ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది.

ఉలవలు స్పెర్మ్‌ కౌంట్‌ పెరగటానికి సూపర్‌ ఫుడ్‌గా ఉపయోగపడుతుంది. (horse grams) ఉలవలలో ఉండే, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌,అమినో యాసిడ్స్‌.. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేసేందుకు సహాయపడతాయి. అలాగే, మహిళలకు రుతుక్రమ సంబంధిత సమస్యలను సైతం ఎఫెక్టివ్‌గా తగ్గిస్తుంది. కాగా, ఈ ఉలవలను గర్భిణీలు, క్షయ వ్యాధితో బాధపడుతున్నవారు, బరువు తక్కువుగా ఉన్నవారు తినకూడదు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...