పచ్చి ట‌మాటాలను తినడం వల్ల కూడా ఇన్ని లాభాలా?

0
55

మనలో చాలామంది ట‌మాటాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీటిని పరిమిత స్థాయిలో తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ మనం మార్కెట్ కు వెళ్ళినప్పుడు పచ్చి ట‌మాటాలు తక్కువ ధరకు ఇచ్చిన తీసుకోవడానికి ఇష్టపడము. కానీ ఒక్కసారి పచ్చి ట‌మాటా తినడం వల్ల లాభాలు తెలిస్తే ఎంతధరైనా సరే కొనడానికి వెనుకాడరు.

గ్రీన్ టొమాటోలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా  ఉండడం వల్ల శరీరానికి మేలు చేకూరుతుంది. ఇంకా రోదనిరోధక శక్తిని పెంచడంతో పాటు..కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పచ్చి టొమాటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండి  కళ్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. పచ్చి టొమాటోలు రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

పచ్చి టొమాటోలు కేవలం ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా..చర్మానికి కూడా మేలు చేస్తాయి.  వీటిని తినడం వల్ల వృద్ధాప్య ప్రభావం తగ్గి ఎల్లప్పుడూ అందంగా, కాంతివంతంగా కనబడతారు. ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండడం వల్ల ముడతలు కూడా క్రమక్రమంగా తగ్గుతాయి. అందుకే ఇన్ని లాభాలు ఉన్నపచ్చి టొమాటోలను కనీసం ఇప్పుడైనా తినడానికి ప్రయత్నిస్తే అద్భుతమైన లాభాలు పొందవచ్చు.