పుచ్చకాయను చూడగానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?

0
92

వేసవికాలం వచ్చిదంటే చాలు చాలామంది పుచ్చకాయ తినడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఎవ్వరైనా మార్కెట్ కు వెళ్ళినప్పుడు పుచ్చకాయ తీసుకునే ముందు లోపల ఎర్రగా ఉంటుందో లేదో అని సందేహపడుతుంటారు. అందుకే పరిశోధకులు కొన్ని చిట్కాలు తెలియజేసారు.

మొదటగా కనీసం రెండు కిలోలు, అంతకంటే ఎక్కువ బరువు ఉండే పుచ్చకాయను ఎంచుకోవాలి. పుచ్చకాయ తొడిమ ఎండిపోయినట్లు ఉండాలి. తొడిమ లేకపోతే తొడిమ ఉండే ప్రాంతం గట్టిగా ఎండినట్లు ఉండాలి.

అలాగే పుచ్చకాయ గట్టిగా, బరువుగా ఉండాలి. కొన్ని పుచ్చకాయలపై గోధుమ లేదా పసుపు రంగులో గుండ్రంగా మచ్చలుంటాయి. అంటే ఎర్రగా ఉంటుందని అర్ధం. ఎంత ఎర్రగా ఉంటే అంత ఎక్కువ పోషకాలుఉంటాయని అర్ధం. అందుకే  పుచ్చకాయను కొనే ముందు ఇలాంటివి గమనించి తీసుకోవాలి.