బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువుందని డాక్టర్ చెబితే వెంటనే దానిని ఎలా తగ్గించుకోవాలా అని హైరానా పడతాం, అనేక రకాల మెడిసన్ వాడుతున్నారు జనం, అయితే ముందు మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి, ఏది పడితే అది తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది.
మన శరీరానికి కొలెస్ట్రాల్ అత్యవసరం. మితిమీరితేనే ప్రమాదం అని గుర్తించండి. ఇలా చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది, మీరు కచ్చితంగా బరువు అదుపులో ఉంచుకోవాలి, ఇక ఫ్యాట్ ఉన్న ఫుడ్ జోలికి వెళ్లకూడదు.
చేపల్లో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి వారానికి ఓసారి అయినా తీసుకోండి…పొట్టుతీయని ధాన్యాల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.. మీరు దంపుడు బియ్యం, సజ్జలు, జొన్నలు, ఓట్స్ వంటి పొట్టుతీయని ధాన్యాలతో ఏదైనా ఫుడ్ చేసుకుని తీసుకోండి, షుగర్ పేషెంట్లు ఇది తీసుకుంటే మంచిది…బాదం పప్పు, కాజు, పిస్తా, అక్రోట్లు తీసుకుంటే మంచిది. విశ్రాంతి వ్యాయమం చేస్తే ఎంతో మంచిది. ఇలా చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.