గ‌రం మ‌సాలాలు వాడుతున్నారా? ఇది త‌ప్ప‌క తెలుసుకోండి

0
322

వెజ్ నుంచి – నాన్ వెజ్ వరకూ ఏ వంట వండినా క‌చ్చితంగా అందులో మ‌సాలా ఉండాల్సిందే. ఆ ఘాటు వాస‌న ఎంత దూరం వ‌స్తుందో మ‌న ఇళ్ల‌ల్లో చూస్తూ ఉంటాం. అయితే రుచికోసం సువాస‌న కోసం ఈ గ‌రం మ‌సాలాలు వాడుతూ ఉంటాం. అందుకే ప్ర‌తీ ఒక్క‌రి వంటింట్లోఈ సుగంధ ద్రవ్యాల మిశ్రమం ఉంటుంది.

లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలుకలు, మిరియాలు, కరక్కయలు, ధనియాలు, ఇలా గ‌రం మ‌సాలాలో ప్ర‌తీది ఎంతో రుచి ఇస్తుంది. మితంగా దీనిని తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

గరం మసాలా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. గ్యాస్ట్రిక్‌ను తగ్గించే రసాలను విడుదల చేస్తుంది. ఉద‌ర స‌మ‌స్య‌లు ఉన్నా త‌గ్గుతాయి.బరువును తగ్గించడంలో స‌హాయ‌ప‌డుతుంది. ఇందులో వాడే లవంగాల వ‌ల్ల నోరు శుభ్రం అవుతుంది. చిగురు స‌మ‌స్య‌లు ఉండ‌వు యాల‌కుల వ‌ల్ల గుండె స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే మంచిది క‌దా అని అతిగా తిన‌కూడ‌దు. వారానికి ఓసారి తీసుకుంటే మంచిది అది కూడా సొంతంగా ఇంట్లో చేసుకున్న మ‌సాలాలు మంచివి అంటున్నారు నిపుణులు.

ఒక‌వేళ ఈ గ‌రం మ‌సాలా మీకు ప‌డ‌క‌పోతే, క‌డుపులో మంట ఇలాంటి స‌మ‌స్య వ‌స్తే వాటికి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు.