రక్తంలో చక్కెరలు మోతాదును మించితే ఈ సమస్యలు వస్తాయట..!

0
113

ఆరోగ్యంగా ఉండాలని ఎవరుమాత్రం కోరుకోరు చెప్పండి. కానీ ప్రస్తుతకాలంలో చాలామంది గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు కారణాలు ఏంటంటే..రక్తంలో చక్కెరలు పరిమిత స్థాయిని మించితే మధుమేహంగా మారుతుంది.

కావున ఈ అనారోగ్య సమస్యల భారీన పడే అవకాశం అధికంగా ఉంటుంది. శరీరం ఇన్సులిన్ ను తగినంత ఉత్పత్తి చేయలేనప్పుడు మధుమేహం ఎర్పడుతుంది. కావున మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ 180 ఉందంటే దాన్ని అధిక స్థాయిగానే పరిగణించాలి.

అంతేకాకుండా ఆకలి పెరిగి, అదే సమయంలో బరువు తగ్గారంటే అది కచ్చితంగా మధుమేహం సూచనగానే పరిగణించి వైద్యులను సంప్రదించడం మంచిది. వైద్యుల సూచన మేరకు  డయాబెటిస్ కు వెంటనే చికిత్స చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. లేదంటే రక్తనాళాలు దెబ్బతింటాయి.

దీని ఫలితంగా రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి తిమ్మిర్లు , జలదరింపు ఉంటాయి. ఇంకా క్తంలో అధికంగా గ్లూకోజ్ ఉన్నా కానీ, ఇన్సులిన్ లేమి కారణంగా దాన్ని శరీరం ఉపయోగించుకోలేదు. దీనికి బదులు స్టోర్ లో ఉన్న కొవ్వులను ఉపయోగించుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారు. రక్తంలో గ్లూకోజు పెరగడం వల్ల కంటి వెనుక భాగంలో రక్తనాళాల పరిమాణం పెరుగుతుంది. ఇదే కంటి చూపు తగ్గిపోయేందుకు దారితీస్తుంది.