చాలామంది సొరకాయ కూర తినడానికి ఇష్టపడరు. కనీసం సొరకాయ చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఒక్కసారి దాని లాభాలు తెలుసుకుంటే రోజు అదే కూర కావాలంటారు. చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి సొరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్న సొరకాయ తింటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో మీరు కూడా చూడండి..
కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. వేసవిలో శరీరాన్ని చల్లబరచడంలో సొరకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇనుము, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. సొరకాయ ఎంత తిన్న తొందరగా జీర్ణమయ్యే మంచి సుగుణం దీనిలో ఉంది. సొరకాయలో పీచు పదార్ధం అధికంగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బి.పి, మదుమేహ సమస్యలు ఉన్నవారికి చక్కగా ఉపయోగపడుతుంది.
శరీరం పొడిబారకుండా, నిగనిగ మెరవడానికి సొరకాయ సహాయపడుతుంది. కిడ్నీ సమస్యలున్న వారు ఇది తీసుకోవడం మంచిది. కేవలం సొరకాయ వల్లనే కాకుండా..దాని రసం తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సొరకాయ రసం రోజు తాగడం వల్ల జుట్టు నెరవకుండా ఉంటుంది. వేసవికాలంలో ఉదయం పూట ఒక గ్లాసు సొరకాయ రసం తాగడం వల్ల వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.