వేసవిలో చాలామంది శరీరం చల్లగా ఉండాలని వివిధ ఆహారపదార్దాలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చల్లటి పానీయాలు, చల్లటి నీళ్లు తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. అందుకే వేసవిలో శరీరం చల్లగా ఉండడంతో పాటు..ఎలాంటి సమస్యలకైనా చెక్ పెట్టాలంటే ఈ ఒక్క పదార్దాన్ని రోజు తీసుకుంటే సరిపోతుంది. అదేంటో మీరు కూడా చూసేయండి..
వేసవిలో తాటిముంజలు తీసుకోవడం వల్ల అద్భుతమైనప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో అనారోగ్య సమస్యలను మన దరికి చేరకుండా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వేసవిలో రోజు తాటి ముంజలు అధికంగా తీసుకోవడం ద్వారా త్వరగా బరువు తగ్గుతారు. దీనిలో నీటిశాతం అధికంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన తేమ అందుతుంది.
అంతేకాకుండా వీటిలో ఐరన్, క్యాల్షియం, జింక్, పొటాషియం, ఫాస్ఫరస్‌లు, విటమిన్-ఎ, బి, సి పుష్కలంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. వేసవిలో వీటిని అధికంగా తీసుకొవడం వల్ల వడ దెబ్బ తగలకుండా ఉంటుంది. అందుకే ముఖ్యంగా చిన్న పిల్లలు వీటిని తీసుకుంటూ ఉండాలి.