మంత్రి కేటీఆర్ ఇలాకాలో డాక్టర్ కేఏ పాల్ పై టిఆర్ఎస్ నాయకుల దాడీ…?

0
47

తెలంగాణాలో కొన్నిరోజుల క్రితం వడగాలులు, అకాల వర్షల కారణంగా అన్నదాతలు అతలాకుతలం అయ్యి పంటల్లో భారీ నష్టాలు చెవిచూడవలసి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజన్నసిరిసిల్ల జిల్లా తంగాళ్లపల్లి మండలం బస్వపూర్ గ్రామంలో అకాల వర్షాల కారణంగా భారీగా పంటలు దెబ్బతినడంతో రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈ ఘటనపై విశ్వ శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందిస్తూ రైతులను పరామర్శించడానికి తన పేస్ బుక్ లైవ్ ద్వారా బస్వపూర్ గ్రామానికి వస్తున్నట్లు  తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేఏ పాల్ ను అడ్డుకోవడానికి భారీ బందోబస్తుతో జిల్లెళ్ల చెక్ పోస్ట్ వద్దకు భారీగా చేరుకొని కేఏపాల్ ను పట్టుకున్నారు. పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో కేఏపాల్ పై టీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా దాడి చేయడంతో చుట్టూ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.