వేసవిలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో కిడ్నీల సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కావున ఈ సమస్య నుండి బయటపడాలంటే అధికంగా నీరు తాగాలి. కేవలం కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినకుండా చేయడమే కాకుండా అనేక రకాల సమస్యలను కూడా మన దరికి చేరకుండా కాపాడుతుంది.
వేసవిలో కిడ్నీ స్టోన్‌కు అతి పెద్ద కారణం నీళ్లుతాగకపోవడంతో పాటు..ఉష్ణోగ్రత పెరగడం కూడా అని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడయింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వచ్చి ఎఫెక్ట్ మూత్రపిండాలపై పడుతుంది. వేసవిలో వేడి బాగా ఉంటుందని చల్లటి పానీయాలు తాగుతుంటారు. కానీ అవి తాగడం వల్ల కిడ్నీపై హానికరమైన ప్రభావం చూపిస్తాయి.
వేసవిలో నీరు అధికంగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళ సమస్యను అదుపుచేయడంతో పాటు..వివిధ రకాల సీజనల్ వ్యాధులను కూడా మన దరికి చేరకుండా కాపాడుతుంది. అందుకే రోజుకు కనీసం 4లీటర్లు అయినా నీరు త్రాగాలి. సీజనల్ పండ్లు ,కూరగాయల రసం కూడా కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గిస్తుంది. పీచు పుష్కలంగా ఉండే పైనాపిల్ వంటి ఆహారపదార్దాలు తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది.