రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

0
132

ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వేధించడంతో పాటు..అప్పుడప్పుడు ప్రాణానికే ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కావున రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వడంతో పాటు..ఈ ఆహారపదార్దాలు తీసుకొండి..

రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపట్టాలంటే గోరువెచ్చని పాలు తాగడం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. పాలలో ఉండే కాల్షియం ఒత్తిడి తగ్గిస్తుంది మరియు మెదడులోని నరాలను ఫ్రీ చేయడం వల్ల గాఢంగా నిద్రపోతారు. దాంతోపాటు అరటిపండ్లు తినడం వల్ల కూడా త్వరగా నిద్ర పడుతుంది. అరటి పండ్లలో ట్రిప్టోఫోనియా, విటమిన్ బి మరియు మెగ్నిషియం పోటాషియం గాఢ నిద్రలోకి తీసుకుపోవడానికి సహాయపడతాయి.

నిద్ర పోయేటప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయకపోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా పదే పదే పడక ప్రదేశం కూడా మార్చకపోవడం మంచిది. దాంతోపాటు పడుకునేముందు టాయిలెట్ అవసరాలను తప్పకుండా తీర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టైం ప్రకారం నిద్ర పోవటం వల్ల త్వరగా నిద్రపడుతుంది.