Ignore these foods to avoid menstrual problems: పీరియడ్స్ టైం లో కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఒళ్లు బరువుగా అనిపించడం, బ్రెస్ట్ పెయిన్, పొత్తికడుపులో నొప్పి లాంటి నెలసరి ఇబ్బందులు బాధిస్తుంటాయి. అవన్నీ దూరం కావాలంటే ఆ రోజుల్లో కొన్ని పదార్థాలకు నో చెప్పేయాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే…
శాచురేటెడ్ ఫ్యాట్స్: ఇవి ఎక్కువగా ఉండే పదార్థాలను పీరియడ్స్ సమయంలో మానేయాలి. మాంసాహారం, పాల ఉత్పత్తుల ద్వారా అందే ఈ కొవ్వులు ఈస్ట్రోజన్ హార్మోన్ మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. వీటిలో ఉండే ఆరాలిడోనిక్ యాసిడ్ గర్భాశయ సంకోచ వ్యాకోచాలను ప్రేరేపించే ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా రొమ్ముల్లో సలపరం, మూడ్ స్వింగ్స్, ఒళ్లు బరువుగా ఉండడం లాంటి నెలసరి సమస్యలు వేధిస్తాయి.
కూల్ డ్రింక్స్: ఇవి శరీరంలో నీటి నిల్వను పెంచుతాయి. మరీ ముఖ్యంగా నెలసరి సమయంలో వీటిని తాగడం వల్ల నెలసరి నొప్పులు మరింత పెరుగుతాయి.
కాఫీ: కెఫీన్ రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. కాఫీ తాగడం వల్ల గర్భాశయానికి వెళ్లే రక్తనాళం ఇరుకుగా మారి నెలసరి నొప్పి పెరుగుతుంది.
ఉప్పు: నెలసరి సహజ లక్షణమైన బ్లోటింగ్ ఉప్పుతో రెట్టింపవుతుంది కాబట్టి ఉప్పుతో కూడిన చిప్స్ లాంటి పదార్థాలు తినకూడదు.
Read Also: