రోగనిరోధక శక్తి త‌క్కువ ఉంద‌ని హెచ్చరించే లక్షణాలు ఇవే త‌ప్ప‌క తెలుసుకోండి

రోగనిరోధక శక్తి త‌క్కువ ఉంద‌ని హెచ్చరించే లక్షణాలు ఇవే త‌ప్ప‌క తెలుసుకోండి

0
81

చాలా మందికి ఇమ్యునిటీ ప‌వ‌ర్ తక్కువ ఉంటుంది ..విట‌మిన్ సీ ఆహ‌రం తీసుకున్నా త‌ర‌చూ అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు, వారికి ఎంతో భయం వేస్తుంది, అయితే ఇలా ఇమ్యునిటీ ప‌వ‌ర్ అదే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డానికి అస‌లు కార‌ణాలు అలాగే, వీటి ల‌క్ష‌ణాలు కొన్ని ఉన్నాయి అవి తెలుసుకుందాం.

త‌రచు జలుబు, దగ్గు..గొంతు నొప్పి ఇలా ఉంది అంటే క‌చ్చితంగా మీకు ఇమ్యునిటీ ప‌వ‌ర్ చాలా త‌క్కువ‌గా ఉంది అని అర్ధం, సంవ‌త్స‌రానికి నాలుగు ఐదు సార్లు కంటే ఎక్కువ జ‌లుబు వ‌స్తే అది చూపించుకోవాల్సిందే.

నిద్ర లేచాక.. భారంగా ఉంటుందా..క‌చ్చితంగా 7 నుంచి 8 గంట‌లు ప‌డుకున్నా భారంగా ఉంటే ఇమ్యునిటీ ప‌వ‌ర్ త‌క్కువ ఉన్న‌ట్లు.

మీరు తిన్న ఆహ‌రం జీర్ణం అవ్వ‌క‌పోవ‌డం క‌డుపు మంట‌, మ‌ల బ‌ద్ద‌కం ఉన్నా ఇది ఇమ్యునిటీ ప్రాబ్ల‌మ్.. ఇక ఏదైనా గాయాలు మాన‌డానికి స‌మ‌యం తీసుకున్నా ఇమ్యునిటీ ప‌వ‌ర్ త‌క్కువ ఉన్న‌ట్లే
చెవి, సైనస్‌ సమస్యలకు తరచుగా గురవుతున్నారంటే ఇది కూడా ఓ కార‌ణం అవ్వ‌చ్చు, అశ్ర‌ద్ద చేయ‌కుండా వైద్యుల‌ని సంప్ర‌దించండి.