ఇమ్యునిటీ పవర్ పెరగాలంటే ఈ పది ఆహరపదార్ధాలు తీసుకోండి

ఇమ్యునిటీ పవర్ పెరగాలంటే ఈ పది ఆహరపదార్ధాలు తీసుకోండి

0
37

ఈ కరోనా సమయంలో అందరూ ఇమ్యునిటీ పవర్ పెరగాలి అని చెబుతున్నారు, అందుకే మార్కెట్లో ఇమ్యునిటీ పవర్ పెరిగే ఫుడ్ ఏమిటి అని చాలా మంది చూస్తున్నారు, గూగుల్ చేస్తున్నారు, అయితే వైద్యులు కూడా తప్పకుండా ఈ ఫుడ్ తీసుకుంటే మీ శరీర రక్షణ వ్యవస్ధ బాగుంటుంది అని చెబుతున్నారు.

మీరు వారానికి రెండు లేదా మూడు రోజులు పాలకూర తీసుకోండి సులువుగా జీర్ణం అవుతుంది, అలాగే ఫొలెట్ ఇందులో ఎక్కువగా ఉంటుంది, రక్తం కూడా ఎక్కువ పడుతుంది పాలకూరతో..ఇక పుచ్చకాయ ఈ సీజన్ అయిపోయింది అయితే ఇంకా ఎక్కడైనా దొరికితే మాత్రం తీసుకోవచ్చు, మంచి ఇమ్యునిటీ పెరుగుతుంది దీంతో.

ఇక ఇంకా బాదం కూడా చాలా మంచిది బి విటమిన్ ఇందులో ఉంటుంది….నిమ్మ సిట్రిస్ ఫలాలు దానిమ్మ బత్తాయి కచ్చితంగా తీసుకోవాలి.. ఇక రోజూ నిమ్మరసం ఓ గ్లాస్ తాగినా మంచి ఇమ్యునిటీ పవర్ వస్తుంది. వెల్లుల్లి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి,ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
స్వీట్ పొటాటో ..బ్రోకలి, క్యారెట్, పుట్టగొడుగులు, ఓట్స్, ఉల్లిగడ్డలు, పసుపు..పెరుగు తీసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ ఇమ్యునిటీని పెంచుతాయి.