కంటి చూపు మెరుగుపడాలా?..అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Improve eyesight? .. But these tips are for you ..

0
44

ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బుందులు పడుతున్నారు. రోజంతా కంప్యూటర్ స్క్రీన్‌లు, ఫోన్‌లు చూడటం వల్ల అనేక మంది కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా వయస్సు మీద పడకపోయినా.. జీవనశైలి మార్పులతో చిన్న వయస్సులోనే కంటి చూపుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మారుతున్న జీవనశైలి ప్రకారం..కంటి సంరక్షణకు మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ ఆహారాలు మీ కంటి సమస్యలను దూరం చేసి మంచి కాంతిని అందించడంలో సహాయపడతాయి. కంటి సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం ఆహారంలో ఏయే పదార్థాలు చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను పోరాడటంతో ప్రముఖపాత్ర పోషిస్తాయి. ఆకుకూరలు.. మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించి మీ కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి.

డ్రై ఫ్రూట్స్ రుచిగా ఉండటంతో పాటు..రోగ నిరోధకశక్తి బలంగా మారుస్తాయి. దీంతో పాటు కంటిచూపును మెరుగు పర్చి సమస్యలను దూరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

క్యారెట్ జ్యూస్ కంటికి చాలా మేలు చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఇది కంటికి సంబంధించిన అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.