ఇండియా కరోనా హెల్త్ బులెటిన్ విడుదల..కొత్త కేసులు ఎన్నంటే?

0
99
RT-PCR mandatory

ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 21,411 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 18,143 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.45 శాతానికి చేరింది.

మొత్తం కేసులు : 4,38,88,775

మొత్తం మరణాలు: 5,26,033

యాక్టివ్​ కేసులు: 1,52,200

కోలుకున్నవారి సంఖ్య: 4,32,10,522