ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే భయం అందరిలోనూ నెలకొంది.
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 18815 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,85,554 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,22,335 కు చేరింది.
ఇక దేశంలో తాజాగా 38 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,25,343 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15899 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,29,37,876 కు చేరింది.