ఇండియా కరోనా అప్డేట్..నిన్నతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు..

0
105

కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభణ క్రమక్రమంగా తగ్గుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నా… మన దేశంలో మాత్రం రోజురోజుకు కేసులు తగ్గుతున్నాయి. దాంతో నెమ్మదిగా ప్రజలు భయ విముక్తులవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 1,150 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య4,30,40,972 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య  11,558కు చేరింది. దేశంలో తాజాగా 04 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య  52,1751కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,86,51,53,593 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 12,56,533మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.76 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య  4,25,08,788కు చేరింది.