పసుపు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదా కాదా ? వేడి చేస్తుందా చేయదా?

drinking turmeric milk good for health or not?

0
46

కొంత మంది పాలు తాగడానికి అంత ఇష్టం చూపించరు. మరికొందరు పాలు తాగకపోతే అస్సలు నిద్ర పట్టదు అంటారు. ఇక పిల్లలు పెద్దలు అందరూ పాలు తాగుతారు. అయితే ఉత్తి పాలే కాదు మిరియాల పాలు పసుపు పాలు సొంటి పాలు చాలా మంది తాగుతారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే పసుపు పాల వల్ల చాలా మంది శరీరానికి బాగా వేడి చేస్తుంది అని అనుకుంటారు? అది మరీ ఎక్కువగా రోజుకి రెండు మూడు సార్లు తాగితే అవుతుంది అంటున్నారు నిపుణులు. పసుపు కలుపుకుని పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడులోని కణాల ఆర్యోగానికి సహాయపడతాయి. జలుబు, గొంతు నొప్పి ఉన్న వారికి ఉపశమనం ఉంటుంది. అంతేకాదు కఫం సమస్యలు పోతాయి. పసుపు పాలతో ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

ఇలా వారానికి రెండు సార్లు అయినా పసుపు పాలు తాగితే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు సమస్యలు తగ్గుతాయి.
జలుబు తలనొప్పి సమస్యలు పోతాయి. పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది. పచ్చకామెర్ల సమస్యలు రావు.
కాలేయానికి మంచిది. మనం తాగే నీటి ద్వారా ఏమైనా కలుషితాలు క్రిములు శరీరంలోకి వచ్చినా. ఈ పసుపు వాటిని నాశనం చేస్తుంది. గొంతు కిరికిరి జలుబు ఈ సమస్యలు రాకుండా చేస్తుంది.