బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా? అయితే ఇలా చేయండి..

0
65

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిదే మానవ మనుగడ లేదు. మరి మనలో చాలా మంది కొన్ని నెలలకు సరిపడే బియ్యాన్ని నిల్వ చేసుకుంటారు. అయితే ఆ బియ్యం చెడిపోకుండా, పురుగుపట్టకుండా చూసుకోవాలి. లేదంటే బియ్యంలోని పురుగుల వల్ల అనారోగ్యానికి గురవుతాం. మరి దానికి మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

లవంగాలు 

బియ్యం నిల్వ చేసిన డబ్బాల్లో కొన్ని లవంగాలను వేయండి. దీంతో ఆ బియ్యంలోకి పురుగులు చేరవు. లవంగాలకు కీటకాలతో పోరాడే గుణం ఉంటుంది. బియ్యం పురుగుప‌ట్ట‌కుండా చేయ‌డంలో ల‌వంగాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తాయి. బియ్యంలో ల‌వంగాల‌ను ఉంచ‌డం వల్ల లేదా ల‌వంగాల పొడిని వస్త్రంలో క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల కూడా పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి పొట్టును మనం బయట పడేస్తుంటాం. అలా చేయకుండా వెల్లుల్లి పొట్టు తీసి బియ్యంలో ఉంచ‌డం వల్ల బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.

కర్నూరం

క‌ర్ఫూరాన్ని కూడా పరుగులు రాకుండా ఉపయోగించవచ్చు. కొంత కర్పుం తీసుకుని చిన్న గుడ్డలో మూట‌లుగా క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల పురుగులు ప‌ట్ట‌కుండా నిల్వ చేసుకోవచ్చు.

వేపాకు 

బియ్యంలో పురుగులు చేరకుండా అద్భుంగా పని చేస్తుంది వేపాకు. బియ్యాన్ని నిల్వ చేసుకునే డ‌బ్బా అడుగు భాగాన వేపాకును ఉంచాలి. ఈ వేపాకుపై బియ్యం పోయాలి. ఇలా కాకుండా వేపాకుల పొడిని ఓ గుడ్డలో మూట‌లుగా క‌ట్టి బియ్యంలో ఉంచితే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయ‌డం వల్ల కూడా బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.