వేసవిలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో కిడ్నీల సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కావున ఈ సమస్య నుండి బయటపడాలంటే అధికంగా నీరు తాగాలి. కేవలం కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినకుండా చేయడమే కాకుండా అనేక రకాల సమస్యలను కూడా మన దరికి చేరకుండా కాపాడుతుంది.
అందుకే మూత్రపిండాల్లో రాళ్లు సమస్య ఉన్నవారికి ఈ మొక్క చక్కని ఔషధంగా పనిచేస్తుందని తాజాగా చేసిన పరిశోధనాలో వెల్లడయింది. నేల ఉసిరి మొక్క ఆకులకు కిడ్నీ స్టోన్లను కరిగించే శక్తి ఉన్నట్లు వెల్లడైంది. అందువల్ల కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఈ మొక్క ఆకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మొదటగా ఉసిరి మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి సన్నని మంటపై కాసేపు మరిగించాలి.
ఈ విధంగా నేల ఉసిరి ఆకులతో కషాయం తయారు చేసుకుని ఉదయం, సాయంత్రం భోజనం అనంతరం ఒక గంట విరామం ఇచ్చి ఈ కషాయాన్ని తాగుతూ ఉండడం వల్ల అనుకున్న దాని కంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇలా నెల రోజుల పాటు తాగితే కిడ్నీల్లో రాళ్ళూ ఇట్టే కరిగిపోతాయి. ఈ కాషాయం కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.