వేసవిలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో కిడ్నీల సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కావున ఈ సమస్య నుండి బయటపడాలంటే అధికంగా నీరు తాగాలి. కేవలం కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినకుండా చేయడమే కాకుండా అనేక రకాల సమస్యలను కూడా మన దరికి చేరకుండా కాపాడుతుంది.
మధుమేహం, అధిక రక్తపోటు ఇలా ఎలాంటి సమస్యకైనా సరిపడా నీళ్లు తాగకపోవడం కారణమని చెప్పుకోవచ్చు. సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లు వేసవిలో రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి. డయాలసిస్ తీసుకుంటున్నవాళ్లు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవాళ్లు, లేదా అలాంటి తత్వం కలిగినవాళ్లు శరీరంలో నీటి శాతం సమంగా ఉండేలా చూసుకోవాలి. ఎన్ని నీళ్లు తాగుతున్నారు, మూత్రం ద్వారా ఎంత నీరు బయటకు వెళ్లిపోతోందో ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం సరిపడా నీళ్లు తాగకపోవడమే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు కేవలం నీరు తాగాకాకా పోవడమే కాకుండా వంశపారంపర్యంగా కూడా సంక్రమించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే కుటుంబసభ్యులు అందరు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే జీవితాంతం తిరిగి రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.