కరోనా వైరస్ ఇలానే వ్యాపిస్తోంది..!

కరోనా వైరస్ ఇలానే వ్యాపిస్తోంది..!

0
37

క‌రోనా వైర‌స్ : మన దేశంలో కేరళలో ఏడుగురికి కరొనా వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో వారిపై పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లో నలుగురికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చన్న అనుమానంతో టెస్టులు చేస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతానికి ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని చెబుతున్నా ఇది వైరస్ కాబట్టి గాలి ద్వారా ఒకరి నుంచీ మరొకరికి సోకుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదే.

వ్యాధి లక్షణాలు : ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్ర‌దించాలి.

వైరస్ ఎలా వ్యాపిస్తుంది : ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది. వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్… బాడీపైకి వచ్చి క్రమంగా అవి నోట్లోంచీ ఊపిరి తిత్తుల్లోకి వెళ్తాయి. అంతే వైరస్ వచ్చినట్లే. ఇవి ఎంత వేగంగా వస్తాయంటే చేతులు శుభ్రం చేసుకునేలోపే వచ్చేస్తాయి.