కొబ్బరి వల్ల కలిగే 10 ప్రయోజనాలు ఇవే

కొబ్బరి వల్ల కలిగే 10 ప్రయోజనాలు ఇవే

0
106
Coconut Benefits

మనలో చాలా మంది కొబ్బరి ఆహారంగా తీసుకుంటారు, ఇది లేత కొబ్బరిగా తీసుకుంటే దాని టేస్ట్ అదిరిపోతుంది, ఇక కొబ్బరి చట్నీ, కొబ్బరి ఉండలు ఇలా అనేక రకాల ఆహర పదార్దాలు తయారు చేస్తారు. ఇక పచ్చి కొబ్బరి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి, పచ్చికొబ్బరిపాలుతో శరీర అలసట తగ్గుతుంది

అటుకులు, కొబ్బరిపాలు, బెల్లం కలిపిన బలవర్ధకమైన ఆహారాన్ని మూడేండ్ల వయసు నుంచి పెరిగే పిల్లలకు ఇస్తే మంచిదని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు. ఇక బాగా ఎండిన కొబ్బరి నుంచి తీసే నూనె వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఇది తలకు రాస్తే చుండ్రు సమస్యలు తగ్గుతాయి, కొబ్బరి నూనె నోటిలో వేసుకుని పుక్కలించండి నోటి సమస్యలు దూరం అవుతాయి.

బాగా ముదిరిన కురిడి కట్టిన కాయను ఆహారంలో అప్పుడప్పుడు చేర్చుకోవడంతో దానిలోని చమురు కారణంగా పొత్తి కడుపు శుభ్రం అవుతుంది. ఇక కొబ్బరి పంచార తీసుకుంటే బాగా లావు అవుతారు. సన్నగా ఉన్న వారు ఇలా తింటారు. ఇక కొబ్బరి బెల్లం కలిపి తీసుకున్నా చాలా మంచిది ఐరెన్ పుష్కలంగా వస్తుంది.