లక్ష్మీ దేవి మీ ద‌గ్గ‌ర నిల‌వాలంటే ఈ తప్పులు చేయకండి

Lakshmi Devi Do not make these mistakes if you want to stay close to you

0
168

జీవితంలో ఎంత కష్టపడుతున్నా ఆర్దిక ఇబ్బందులు తొలగడం లేదు, అన్ని ఇబ్బందులు నాకే వస్తున్నాయి అని కొందరు అనుకుంటారు. అనేక ఆర్ధికపరమైన సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి అని బాధపడతారు. దేవుడ్ని కొలుస్తున్నా నిత్యం పూజలు అభిషేకాలు చేస్తున్నా నాకు ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి అని కొందరు విచారిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటున్నారు పండితులు.

మనం ఆమె అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అసలు లక్ష్మీ దేవికి ఇష్టమైన స్ధానాలు ఏమిటి ? ఆమె ఎక్కడ ఉంటుంది అంటే పాలు ,పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెబుతారు వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఎప్పుడూ నిందించ‌కూడ‌దు కాళ్లు త‌గ‌ల‌కూడ‌దు.

ఉదయం ఇంటిలో అందరూ నిద్ర లేవాలి అంతేకాదు సాయంత్రం వేళ అవ్వగానే దీపం లేదా లైట్ కచ్చితంగా వెలిగించాలి. సోమరితనంతో ఉంటే అమ్మవారి కటాక్షం ఉండదు కలహాలతో వుండే ఇళ్లవైపు లక్ష్మీదేవి చూడదు. ఇళ్లు అందంగా ఉండాలి అంతేకాదు బట్టలు వస్తువులు చెల్లాచెదురుగా ఉండకూడదు.