శంకర్ – చరణ్ సినిమాలో ఆ ఎపిసోడ్ కు 10 కోట్లట – టాలీవుడ్ టాక్

10 crores for that episode in Shankar Ram Charan movie

0
15

ప్రముఖ దర్శకుడు శంకర్, హీరో చరణ్ కాంబినేషన్ లో సినిమా రానుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు అని ఫిలిమ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఇక శంకర్ సినిమా అంటే ఖర్చుకి ఏ మాత్రం నిర్మాతలు వెనకడుగు వేయరు. ఆయన సినిమాలో ఒక్కో సీన్ అంత అద్భుతంగా ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చేశారు ఆయన. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సుమారు ఈ సినిమాకి 200 కోట్ల రూపాయల బ‌డ్జెట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ స్టోరీ రానుందట. పాన్ ఇండియా స్ధాయిలో రానున్న ఈ సినిమాలో కియరా చరణ్ సరసన నటిస్తోంది.
తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు ఈ చిత్రం. ఈ సినిమాలో చరణ్ సర్కారు కొలువు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో రన్నింగ్ ట్రైన్ లో సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంద‌ట. దీని కోసం భారీగా ఖర్చు చేయనున్నారట. దాదాపు 10 నుంచి 12 కోట్లు ఈ ఎపిసోడ్ కు ఖర్చు చేసే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దర్శకుడు శంకర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే.