బరువు తగ్గాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి

Lose weight? Follow these tips though

0
52

ఈ జనరేషన్‌లో చాలా మందిని వేధిస్తున్న సమస్య బరువు పెరగడం. చాలామంది కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చొని పని చేయడంతో లావైపోతున్నారు. పొట్ట చుట్టూ అనవసర కొవ్వు పేరుకుపోవడం వల్ల అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో ఒబెసిటీ సమస్య వస్తోంది. పలు సందర్భాల్లో భావోద్వేగ స్థాయిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.మరి బరువు తగ్గాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బరువు పెరగడంతో అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు తగ్గడం కోసం ఎన్నో వ్యాయామాలు, డైట్‌ల గురించి చెప్పినా ఒక్కోసారి పని వల్ల, మరికొన్ని సార్లు బద్ధకంతో ఎందరో బరువు తగ్గించుకోలేకపోతున్నారు. ప్రతి రాత్రి కొన్ని చిట్కాలు పాటించడం, ఆహారంలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా సులభంగా బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. బరువును నియంత్రించడంలో నీరు ప్రభావవంతంగా ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి నీరు ఎక్కువగా తాగాలి. తద్వారా కడుపు నిండిన అనుభూతిని కలిగించడంతో పాటు అనవసరమైన కేలరీలను తీసుకోకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం అని అందరూ అంటుంటారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో దినచర్య అస్తవ్యస్తంగా మారింది. ఒక అధ్యయనం ప్రకారం.. తగినంత నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణమని తేలింది. ఒక వ్యక్తికి కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర అవసరం.