పరిగడుపున బీట్‌ రూట్ జ్యూస్ తాగితే బోలెడు ప్రయోజనాలు..

0
99

చాలామందికి బీట్ రూట్ అంటే ఇష్టం ఉండదు. కానీ దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే బీట్‌ రూట్ ను తినకపోయినా ప్రతిరోజు ఉదయం పరిగడుపున బీట్‌ రూట్ జ్యూస్ చేసుకొని దానిలో కొంచెం చెక్కర వేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. బీట్‌ రూట్ లో మనిషికి కావాల్సిన పోషకాలు కూడా పుష్కలంగా పొందవచ్చు. పరిగడుపున బీట్‌ రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

రక్తహీతనకు చెక్ పెట్టొచ్చు: ఐర‌న్ తక్కువగా ఉంటే రక్తహీనతకు గురవుతారు. బీట్‌ రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుదల అధికంగా పెరుగుతుంది. అలాగే బ్లడ్ లో హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా పెరుగుతుంది.

నీరసం పోతుంది: చాలా మంది నీరసంతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు కొన్ని బీట్ రూమ్ ముక్కలు తిన్నా లేదంటే బీట్ రూట్ జ్యూస్ తాగినా సరిపోతుంది. దీంతో నీరసం పోయి ఫుల్ ఎనర్జీగా ఉంటారు.

గుండె జబ్బులు సమస్యల నియంత్రణ: తరుచూ బీట్ రూట్ తింటూ ఉంటే గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాం. బీట్ రూట్ జ్యూస్ తాగినా సరే గుండె సంబంధిత వ్యాధులు రావు.

విటమిన్స్:బీట్ రూట్‌ లో బాడీకి కావాల్సిన చాలా విటమిన్స్ ఉంటాయి. బీ సీ విటమిన్స్ అందుతాయి. బీపీ నియంత్రణలో ఉండేందుకు బీట్ రూట్ బాగా దోహదం చేస్తుంది. బీట్ రూట్‌లో కాల్షియంతో పాటు మెగ్నిషియం కూడా బాగానే ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇవన్నీ ప్రతి మనిషికి చాలా అవసరం.కాబట్టి అందరు బీట్ రూట్ తీసుకోండి.

ఉల్లాసంగా ఉంటారు:  బీట్ రూట్ జ్యూస్ తాగితే ఉల్లాసంగా ఉంటారు. మూడీగా ఉండేవారు అప్పుడప్పుడు బీట్ రూట్ జ్యూస్ తాగుతూ ఉండండి. మీలో ఎక్కడలేని శక్తి పుంజుకుంటుంది.

గర్భిణీలకు చాలా మంచిది :బీట్ రూట్ గర్భిణీలకు చాలా మంచిది. ప్రెగ్నెంట్స్ కు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ మొత్తం కూడా బీట్ రూట్ ద్వారా అందుతుంది. గర్భంలోని పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం చాలా మంచిది.

మెమోరీ పెరుగుతుంది: రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగుతూ ఉంటే మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. బ్రెయిన్ కావాల్సిన బ్లడ్ సప్లై అయ్యేలా బీట్ రూట్ చేయగలదు. ఏకాగ్రతను పెంచగల శక్తి కూడా బీట్ రూట్ కు ఉంది. అలాగే కాలేయం క్లీన్ కావడానికి బీట్ రూట్ చాలా దోహదపడుతుంది.

కాబట్టి అందరు ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి..