ఇంట్లోనే ప‌న్నీర్ను తయారు చేసుకోండిలా..రోజు తింటే ఎన్ని ప్రయోజనాలో?

0
41

ప్ర‌తిరోజూ పాలను తాగ‌డం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాల‌ల్లో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలోపేతం చేయడంతో పాటు..అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. కానీ పాలను నేరుగా తాగితే రుచించక పోవడంతో..కొంతమందికి పాల వాసన కూడా ఇష్టపడరు. అందుకే ఇంట్లోనే ప‌న్నీర్ను తయారుచేసుకొని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

ముందుగా ఒక లీట‌ర్ చిక్క‌ని పాల‌ను తీసుకుని స్ట‌వ్ మీద ఉంచి 15 నిమిషాల పాటు మరిగించిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సాన్ని వేసి క‌లుపుకోవాలి. అనంతరం మంట‌ను పెంచి 3 నిమిషాల పాటు ఉంచిన తరువాత ఒక గిన్నెలో పెద్దగా ఉండే జ‌ల్లి గంట‌ను ఉంచి దానిలో శుభ్ర‌మైన వ‌స్త్రాన్ని ఉంచి సిద్ధం చేసుకున్న పాల మిశ్ర‌మాన్ని పోయాలి.

దాంతోపాటు అదే వ‌స్త్రంలో మిగిలి ఉన్న పాల మిశ్రమాన్ని రెండు సార్లు మంచి నీటితో క‌డిగి నీరు లేకుండా గట్టిగా పిండిన తరువాత స‌మానంగా ఉండే చెక్క‌పై పాల మిశ్ర‌మం ఉంచిన వ‌స్త్రాన్ని ఉంచి స‌మానంగా చేసుకోవాలి.  దీనిపై బ‌రువుగా ఉండే రోలు లేదా ఇత‌ర వ‌స్తువుల‌ను ఉంచి 2 నుండి 3 మూడు గంట‌ల పాటు అలాగే ఉంచడం వల్ల నీరు అంతా తొలగిపోయి మెత్త‌గా ఉండే ప‌న్నీర్ త‌యార‌వుతుంది. 3 గంట‌ల త‌రువాత బ‌రువును తొల‌గించి ప‌న్నీర్ ను కావ‌ల్సిన ప‌రిమాణంలో ముక్క‌లుగా చేసుకోవాలి.