రోజు ఉదయాన్నే పసుపు టీ చేసుకోండిలా? తాగితే ఎన్ని ప్రయోజనాలో..

0
116

సాధారణంగా మహిళలు వంటల్లో పసుపు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇది వేయడం వల్ల రంగుతో పాటు రుచి కూడా బాగుంటుంది. పసుపు పరిమితంగా వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పసుపును వంటల్లో వాడడం కన్నా నేరుగా రోజు ఉదయాన్నే ఇలా చేసుకొని తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు.

కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా..ముఖ్య సౌందర్యాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. మనం ముఖానికి వాడే వివిధ అంటిమెంట్స్ లో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. షుగ‌ర్‌ను, బీపీని, కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో ప‌సుపు ఉపయోగపడుతుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి సీజ‌న‌ల్ వ్యాధులను కూడా తగ్గించి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది.

పసుపు టీ తయారు చేసుకునే విధానం..

ఒక గిన్నెల్లో ఒక కప్పున్నర నీళ్లను తీసుకొని కొద్దిగా మరిగించి వేడి అయ్యాక అందులో చిన్న పసుపు కొమ్మును దంచి వేయాలి. తరువాత రెండు నిమిషాల పాటు మల్లి మరిగించాలి. ఆ తరువాత ఈ  మిశ్రమాన్ని వడబోసి అందులో కాస్త మిరియాల పొడి, తేనె వేసి కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా పసుపు టీని రోజూ పరగడుపునే తాగితే అనేక లాభాలను పొందవచ్చు.