తెలంగాణాలో మాస్క్ ధరించడం తప్పనిసరి..లేదంటే ఫైన్ కట్టాల్సిందే

0
105

చైనాలో పురుడు పోసుకున్న ఈ కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ప్రజలను అతలాకుతలం చేసింది. కరోనా విజృంభణ తగ్గినట్టే తగ్గి మళ్ళి విరుచుకుపడుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి.

దాంతో కేసీఆర్ సర్కార్ అలర్ట్ జారీ చేస్తుంది. పాత నిబంధలను మళ్ళి అమలు చేస్తున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఫోర్త్ వేవ్ తప్పదని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ హెచ్చరిస్తుంది. అందుకే అందరు జాగ్రత్తగా ఉండాలని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవికాలంలో వేలాది శుభకార్యాలు ఉంటాయి. జాగ్రత్తలు అవసరం అని సూచించారు.

మళ్ళి మాస్కులు పెట్టుకోవడం, చేతులు శానిటైస్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించమని సూచిస్తున్నారు. ఒకవేళ మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమాన పోలీసులు విధిస్తారని వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. వ్యాక్సిన్ అందరూ తీనుకోవాలని సూచించారు. 60 సంవత్సరాల పైబడిన వారు బుస్టార్ డోస్ తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఆర్ వ్యాల్యూ తక్కువనే ఉన్నగాని ప్రజలు అప్రమథంగా ఉండాలని తెలిపారు.