ఈ రోజుల్లో కొందరు కల్తీ గాళ్లు జనాల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు… వారికి నచ్చిన రీతిన వారికి డబ్బే ముఖ్యం అన్నట్లు కల్తీ చేస్తున్నారు, అయితే ఇటీవల ఓ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఓ కాల్ రిసీవ్ చేసుకున్నారు, అది ఓ బ్యాంకు మేనేజర్ నుంచి అయితే ఆయన బాగా డికార్షన్ రావాలి అని ఓ టీ పౌడర్ లూజ్ కొన్నారట.
అయితే అది ఓ హోల్ సేల్ షాపు నుంచి ..అయితే పాలల్లో వేయగానే అది కలర్ వచ్చేసింది, ఇంతకీ అది బాగా మరగపెడితే ఫుల్ రెడ్ కలర్ వచ్చేసింది, దీంతో ఫుడ్ ఆఫీసర్ అది పరిశీలించారు, అందులో టేస్ట్ రావడానికి బాదం కలర్ లిక్విడ్ కలుపుతున్నారు అని తేలింది, అంతేకాదు ఇందులో పలు రకాల అసైన్స్ కలిపారు.
ఈ మోతాదు ఎక్కువ అవ్వడంతో ఇలా కలర్ వచ్చింది అని తేలింది, ఆ టీపొడి అస్సాం నుంచి యూపీకి తీసుకువచ్చి ఇలా చేస్తున్నారు అని తెలుసుకున్నారు, వారిపై చర్యలు తీసుకున్నారు, ఆ ఆఫీసర్ ఈ విషయం చెప్పారు, టీ మరగపెట్టిన సమయంలో మరీ రెడ్ కలర్ వస్తే అది తాగద్దు అని అందులో అసైన్స్ మోతాదు ఎక్కువ కలిపినట్లు అని తెలిపారు. అందుకే డికార్షన్ మరగపెట్టే సమయంలో చూడండి.