ప్రముఖ బయోపిక్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ?

ప్రముఖ బయోపిక్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ?

0
95

ఇప్పుడు చాలా వ‌ర‌కూ ప్ర‌ముఖుల బ‌యోపిక్స్ తెర‌కెక్కుతున్నాయి, అంతేకాదు ఈ చిత్రాల‌ను ఆ చ‌రిత్ర‌ల‌ను తెలుసుకునేందుకు చాలామంది ఆస‌క్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ అనేకాదు అనేక భాష‌ల్లో ఈ సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు, తెలుగులో కూడా గ‌త కొంత‌కాలంగా ఈ చిత్రాలు బాగా వ‌స్తున్నాయి.

ఇక ప్ర‌ముఖులు న‌టులు రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు క్రీడా కారుల‌పై కూడా ఈ బ‌యోపిక్స్ వ‌స్తున్నాయి, తాజాగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్స్ విజేత, తెలుగు మహిళ అయిన కరణం మల్లేశ్వరి బయోపిక్ కూడా రూపొందుతోంది. టాలీవుడ్ లో ఈ మ‌ధ్య‌ ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

ప్రముఖ రచయిత కోన వెంకట్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తోంది. ఇక ఇందులో కరణం మల్లేశ్వరి పాత్రకు పలువురిని పరిశీలించిన త‌ర్వాత చిత్ర యూనిట్ తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న ఇంకా విడుద‌ల కాలేదు.