ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్‌..

0
159

ఏపీలో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వచ్చే మూడు రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు  సూచిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది.

తూర్పు ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి  ప్రస్తుతం తెలంగాణ నుండి రాయలసీమ మరియు కర్ణాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు, సగటు సముద్ర మట్టానికి 0 .9 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది.

దాంతో ఎండలు పెరిగే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఎల్లుండి తేలికపాటి వర్షాలు అక్కడక్క కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.