జంతువుల నుంచి మనుషులకు అనేక రకాల వ్యాధులు సోకుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు వైద్యులు. ఇక తాజాగా అమెరికాలో మంకీపాక్స్ వ్యాధి ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. ఈ వ్యాధి అమెరికాలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన వ్యక్తిని చాలా జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అతను విమానంలో ప్రయాణించాడు. అతనితో ప్రయాణించిన వ్యక్తులని అందరిని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ఒక్క కేసు మాత్రమే నమోదు అయిందని తెలిపారు వైద్యులు. దీనివల్ల ప్రజలకు పెద్దగా ప్రమాదమేమీ ఉండదని వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం తెలిపింది.
ఈ వ్యాధి కేసుల గురించి ఓసారి హిస్టరీ చూస్తే, 2003లో చివరిసారి 47 మందికి ఇది సోకింది. బ్రిటన్ లో గత నెలలో ఇలాంటివి నాలుగు కేసులు వెలుగుచూశాయి. ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకి సోకుతుంది. స్మాల్పాక్స్ కుటుంబానికి చెందింది ఈ వ్యాధి అని చెబుతున్నారు వైద్యులు. ఇక ఈ వ్యాధి వస్తే తీవ్రజ్వరం, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి, తలనొప్పి వేధిస్తాయి. ముఖం, అరచేయి, అరికాళ్లపై దద్దుర్లు, బొబ్బలు పెద్దవిగా వస్తాయి. అశ్రద్ద మాత్రం చేయకూడదుని నిపుణులు తెలియచేశారు.