తెలంగాణలో మంకీపాక్స్ కలకలం..ఆ జిల్లా వాసికి లక్షణాలు!

0
96

తెలంగాణాలో మంకీపాక్స్‌ కలకలం సృష్టించింది. కువైట్‌ నుంచి కామారెడ్డికి వచ్చిన వ్యక్తిలో మంకీ పాక్స్​ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 6న కువైట్​ నుంచి రాగా.. అతనికి జ్వరం, శరీరంపై దద్దుర్లతో బాధపడుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అనుమానిత వ్యక్తిని ఈరోజు హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. పరీక్షల ఫలితాల అనంతరం మంకీఫాక్స్ సోకిందా? లేదా? అనేది నిర్ధారణ కానుంది.