కరోనా టీకా సెకండ్ డోస్ తీసుకోకపోతే ఏమవుతుంది తప్పక తెలుసుకోండి ?

Must know what happens if the corona vaccine is not taken in the second dose

0
39

కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆయుధం కరోనా టీకా మాత్రమే. అందుకే ప్రతీ ఒక్కరు టీకా తీసుకోవాలి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. చాలా చోట్ల వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. ఇక మొదటి డోస్ తీసుకున్న వారు కచ్చితంగా వారి షెడ్యూల్ ప్రకారం సెకండ్ డోస్ తీసుకోవాలి అని చెబుతున్నారు.

కొంతమంది గడువు దాటినా కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడం లేదు. అయితే సెకండ్ డోస్ తోసుకోకపోతే ఏమవుతుంది అనేది కూడా వైద్యులు చెబుతున్నారు. కరోనా టీకా ఒక డోసు తీసుకుంటే 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయి. మిగిలిన 70 శాతం మందికి అది కేవలం బూస్టర్ డోసుగానే ఉపయోగపడింది. ఒక డోసు తీసుకుంటే మన శరీరం కరోనా పై పోరాటానికి సిద్దం అవుతుంది.

ఇక సెకండ్ డోస్ తీసుకుంటే మెమొరీ-బి కణాలు ఉత్పన్నమవుతాయి. వైరస్ వివరాలను ఈ కణాలు నమోదు చేసుకొని భవిష్యత్తులో ఇదే వైరస్ మన శరీరంపై దాడి చేస్తే, వాటిని గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. అప్పుడు కరోనా వైరస్ పై పోరాటం చేస్తాయి. ఒక్క డోసు తీసుకుంటే మళ్లీ కోవిడ్ సోకే అవకాశాలుంటాయని కచ్చితంగా సరైన సమయానికి మర్చిపోకుండా రెండో డోస్ తీసుకోవాలి అని చెబుతున్నారు.