ఇండియాలో కరోనా విజృంభణ కాస్త తగ్గింది. మొన్నటివరకు 3 లక్షల కేసులు నమోదు కాగా ఈ మధ్య లక్ష కేసులు మాత్రమే నమోదవడం ఊరట కలిగిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో పాటు పలు ఆంక్షలను అమలు చేశాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది రాష్ట్ర ప్రభుత్వం.