ప్రధాని మోడీపై ధ్వజమెత్తిన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్

Modi's whole body is poison: TPCC senior vice-president

0
40

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పార్లమెంటులో ఏపీ, తెలంగాణ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇప్పటికే ప్రధాని వ్యాఖ్యలపై అటు అధికార టిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానిపై ఫైర్ అవుతున్నారు. తాజాగా టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ ధ్వజం ఎత్తారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పీఎం మోడీ నిన్న , మొన్న లోక్ సభ, రాజ్యసభలలో కాంగ్రెస్ మరియు తెలంగాణాకు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలు ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టాయి. ఆయన తన మాటలతో ఆ పదవి స్థాయిని దిగజార్చారు. నిలువెత్తు ద్వేషం, అక్కస్సుతో ఉన్న వ్యక్తి మోడి. ఈ దేశానికి ప్రధాన మంత్రిగా ఉండటానికి అనర్హుడు. అతడు ప్రధాన మంత్రిగా కొనసాగితే దేశ విచిన్నానికి దారి తీస్తుంది. మోడీకి కాంగ్రెస్ అంటే ద్వేషం, ఓర్వలేని తనము. ఆయన శరీరమంతా విషమే.

సందర్భం అయినా కాకున్నా, ఉద్దేశ్యపూర్వకముగా ద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడము ఆయనకు అలవాటయింది. ఇతరులను నొప్పించి, ఆనందించే పైశాచికత్వము ఆయనది. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ నాయకుల పాత్రను, త్యాగాలను యావత్ ప్రపంచమంతా కొనియాడితే, ఈయన మాత్రం తృణీకరిస్తున్నారు. ఈయన దేశ భక్తుడా? దేశ ద్రోహియా? ప్రజలాలోచించాల్సిన సమయము ఆసన్నమైంది. మొన్న సోమవారం లోక్ సభలో స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రును చులకన చేస్తూ మాట్లాడిన మోడీ నిన్న రాజ్యసభలో తెలంగాణా ఏర్పాటును అమర వీరుల బలిదానాలను చులకన చేస్తూ మాట్లాడి తెలంగాణా ప్రజలను అపహాస్యం చేస్తూ మాట్లాడారు.

1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసిన బి.జె.పి ఆ తర్వాత వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా కేంద్రములో అధికారములోకి వచ్చినా తెలంగాణా ఏర్పాటు చేయని బిజెపి, కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని సోనియా గాంధీ నాయకత్వలో ప్రత్యేక రాష్త్రం ఏర్పాటు బిల్లు పాస్ చెస్తే ఎద్దేవా చేయడాన్ని ప్రజలు సహించరు. తెలంగాణా ప్రజలకు మోడీ క్షమాపణలు చెప్పే వరకు బిజెపి వారిని ప్రజలు తెలంగాణాలో తిరుగనివ్వవద్దు. ఇది తెలంగాణా ప్రజల ఆత్మగౌరవ సమస్య అని నిరంజన్ పేర్కొన్నారు.