కరోనా కాదు..ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు?

0
36

కరోనా రాకాసి ప్రపంచాన్ని వణికించింది. ఈ మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న ఈ రాకాసి కలవరం ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన కోవిడ్ ఓ తుఫానులా విరుచుకుపడింది. ఇప్పుడు నాలుగో వేవ్ వస్తుందనే భయంతో ఉన్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతుంది.

ఇప్పటికే కరోనా వైరస్‌ చాలదా అన్నట్టు మంకీపాక్స్‌ వంటి వ్యాధులు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశాయి. ఇప్పుడు ఇది కూడా చాలదా అన్నట్టు డిసీజ్​ ఎక్స్​ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచివుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

‘డిసీజ్‌ ఎక్స్‌’ అనేది ఊహించని, ప్రస్తుతానికి ఊహాజనితమైన, అంటువ్యాధి. అది ఒకవేళ సంభవిస్తే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యాధికి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండురకాల కరోనా వైరస్‌లు, ఇంకా గుర్తించబడని ‘డిసీజ్‌ ఎక్స్‌’తోపాటు ప్రాధాన్యత కలిగిన వ్యాధులను అంచనా వేసేందుకు పరిశోధక రోడ్‌మ్యాపులు, ప్రయోగ నమూనాలను అభివృద్ధి చేశాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (మార్చి నెలలో) వెల్లడించింది. అంతేకాదు ఏదేమైనా భవిష్యత్తులో ఉద్భవించే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.