ఒమిక్రాన్‌ ఎఫెక్ట్..రెండు మాస్క్‌లతో రక్షణ..నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Omicron effect..protection with two masks..what experts say ..

0
102

ప్రపంచవ్యాప్తంగా కరోనా టెర్రర్ కొనసాగుతుంది. కరోనా అనేది.. గాలి ద్వారా వ్యాపించే వైరస్. ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపిస్తుంది. జంతువుల నుంచి మనుషుల్లోకి ఈ వైరస్ పాకిందని రీసెర్చర్లు నమ్ముతున్నారు. వైరస్ నుంచి రక్షించుకోవడానికి ముక్కు, నోరు మూసి ఉండేలా మాస్క్ లు ధరిస్తుంటారు.

ఇదే మన చేతిలో ఉన్న ప్రధానాయుధం. అయితే సింగిల్ మాస్క్ పోయి ఇప్పుడు డబుల్ మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుండి రక్షించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కరోనా నుంచి 91% రక్షణ పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రజా రవాణా, ఆసుపత్రులు లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో రెండు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్న టీకాలు తీసుకోని వ్యక్తులు, వైద్యులు, విమానాశ్రయ సిబ్బంది డబుల్ మాస్కింగ్‌ తప్పనిసరిగా అనుసరించాలని చెబుతున్నారు.

కరోనా వైరస్ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి N95 మాస్క్‌లను ఉత్తమమైన మాస్క్‌లుగా పరిగణిస్తారు. ఇది ముక్కు లేదా నోటిలోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో, సాధారణ సర్జికల్ మాస్క్‌లు కూడా 85% కణాలను నిరోధించగలవు. క్లాత్ మాస్క్‌లు 30 నుంచి 60% రక్షణను మాత్రమే అందిస్తాయి.

ఏ రెండు మాస్క్‌లు కలిసి ధరించాలి అన్న విషయానికొస్తే.. సర్జికల్ మాస్క్‌ పైన క్లాత్ మాస్క్‌లను ఉపయోగించాలి. దీనికి కారణం- క్లాత్ మాస్క్ ధరించడం వల్ల సర్జికల్ మాస్క్ మూలలు పూర్తిగా బిగుతుగా ఉంటాయి. అలాగే, ఒకే సమయంలో రెండు సర్జికల్ మాస్క్‌లు ధరించడం పనికిరాదని గుర్తుంచుకోండి. ఇక N95 మాస్క్ ఒక్కటి ధరిస్తే చాలు పూర్తిగా బిగుతుగా ఉండి కరోనా నుంచి వంద శాతం రక్షణ ఇస్తుంది.