ఐపీఎల్​ 2022: కేకేఆర్​ బౌలింగ్​ కోచ్​ ఎవరో తెలుసా?

IPL 2022: Do you know who is the KKR bowling coach?

0
54

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే మెగా వేలం ప్రక్రియ ప్రారంభంకానుందని బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్​కతా నైట్​ రైడర్స్​ ఫ్రాంఛైజీ తమ జట్టుకోసం కొత్త బౌలింగ్ కోచ్​ను ఎంపిక చేసింది. భరత్​ అరుణ్​కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కోల్​కతా నైట్​ రైడర్స్ ఐపీఎల్​లో విజయవంతమైన టీమ్​గా రాణిస్తోంది. ఈ ఫ్రాంఛైజీతో పనిచేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా.” అని భరత్ అరుణ్ అన్నాడు. కేకేఆర్​ ఫ్రాంఛైజీ నిర్ణయం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్​ఇండియా సీనియర్​ జట్టుకు బౌలింగ్​ కోచ్​గా వ్యవహరించిన భరత్ అరుణ్ ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం కేకేఅర్​ జట్టుకు కోచ్​గా ఎంపికయ్యాడు.

“కేకేఆర్​ కోచింగ్​ బృందంలో చేరిన భరత్ అరుణ్​కు స్వాగతం. అంతర్జాతీయ క్రికెట్​పై మంచి పట్టున్న భరత్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. అతడు ఇతర కోచింగ్ బృందంతో కలిసి బాగా పనిచేస్తాడని ఆశిస్తున్నా.” అని కేకేఆర్ హెడ్​ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ అన్నాడు.