ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

0
88

మనం తినే ఆహారం ప్రకారం మన ఆరోగ్యం ఆధార పడి ఉంటుంది, మన అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి, గుండె ఊపిరితిత్తులు కాలేయం ఈ పనితీరు బాగోపోతే కోలుకోవడం కష్టం అంటున్నారు నిపుణులు, అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక ముఖ్యంగా ఊపిరితిత్తుల విషయాలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది.

ముందు కచ్చితంగా స్మోకింగ్ అలవాటు ఉండే మానెయ్యాలి, దీని వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి, ఇక తాగేవారే కాదు పక్కన వారికి కూడా ఈ పొగ వల్ల ఊపిరితిత్తులు నాశనం అయిపోతాయి.
ఇక వ్యాయామాలు చేయడం చాలా మంచిది, అలాగే ఊపిరి తీసుకోవడం వదలడం ఇలా చేస్తూ ఉంటే ఊపిరితిత్తులకి బాగా ఆక్సిజన్ అందుతుంది.

ఇప్పుడు ఎక్కడ చూసినా వాతావరణం కలుషితమైంది.. అందుకని అధిక కాలుష్య స్థాయిలున్న ప్రదేశాలను సందర్శించడం మానేయాలి. ఫ్యాక్టరీలు పొగలు వచ్చేచోట దూరంగా ఉండాలి, ఇంకా ఆయిల్ మసాలా ఫుడ్ చాలా తక్కువగా తినాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఊపిరితిత్తులకి ఎలాంటి సమస్య ఉండదు. ఇక గుట్కా లాంటి హనికరమైన పదార్దాలు తీసుకోవద్దు ఇది చాలా డేంజర్.