కుంకుమ పువ్వు ఒరిజినల్ – నకిలీ ఎలా గుర్తించాలో తప్పక తెలుసుకోండి?

కుంకుమ పువ్వు ఒరిజినల్ - నకిలీ ఎలా గుర్తించాలో తప్పక తెలుసుకోండి?

0
132

అసలు మార్కెట్లో కుంకుమ పువ్వు చాలా ఖరీదు అయినది కిలో మార్కెట్లో ఒరిజినల్ మూడు లక్షలు ఉంటుంది.. అంటే లక్షకు దొరకేది పక్కా నకిలీ అని గుర్తు ఉంచుకోండి. మరి మనం ఇంత నగదు పోసి కొన్నా అది మంచిది అని తెలుస్తుంది అంటే, దీనికి కొన్ని ట్రిక్స్ చెబుతున్నారు ఆ వ్యాపారులు ..మరి అవి తెలుసుకుందాం.

కశ్మీర్ లో దొరికే కుంకుమపువ్వు క్వాలిటీ ఉంటుంది, అయితే కొందరు ఇక్కడ కూడా కల్తీ చేస్తున్నారు, మరి ఆ కల్తీ ఎలా గుర్తించాలంటే.

ఇక డూబ్లికేట్ కుంకుమ పువ్వు తురిమిన బీట్రూట్, దానిమ్మ తొక్కల్ని రంగులద్దిన మొక్కజొన్న సిల్కుదారాలతో కల్తీ చేస్తారు. ఇక మీకు ఇందులో ఒరిజినల్ ఎలా గుర్తించాలి అంటే
నాణ్యమైన కుంకుమ పువ్వు ఎర్రగా ఉంటుంది. ఘాటైన సువాసన వస్తుంది. చిరుచేదుగా ఉంటుంది.

ముందుగా మీరు గాజు గిన్నె చిన్నది తీసుకోండి, అందులో చల్ల నీరు మాత్రమే పోయండి, అప్పుడు మీరు కొన్ని ఈ కుంకుమ పువ్వు రేకలు వేయండి, ఆ రేకలు వేసిన వెంటనే పసుపు రంగులోకి నీరు మారుతుంది అది కచ్చితంగా ఒరిజినల్ కుంకుమ పువ్వు..ఇలా వేసిన రేకలు కరగవు, విరగవు, రంగు అలాగే ఉంటాయి అది ఒరిజినల్.

మరి డూబ్లికేట్ ఎలా గుర్తించాలి అంటే?

ఆ రేకలు వేసిన వెంటనే నీళ్లు ఎరుపురంగులోకి మారి, రేకలు తెలుపు రంగులోకి వస్తే ఏ మొక్కజొన్న పీచుకో రంగు వేసినవని అర్థం. బీట్ రూట్ రేకలు వేసినట్లు గుర్తించాలి ..రేకల్ని వేళ్లతో తీసి చూడండి విరిగితే అది డూబ్లికేట్ గా గుర్తించాలంటున్నారు వ్యాపారులు.