మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ – హైదరాబాద్ నుంచి కొత్త రైళ్ల సర్వీసులు ఇవి ఉండవచ్చు?

మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ - హైదరాబాద్ నుంచి కొత్త రైళ్ల సర్వీసులు ఇవి ఉండవచ్చు?

0
60

రైల్వేశాఖ లాక్ డౌన్ లో రైళ్లు నడపలేదు, ఇప్పటి వరకూ దేశంలో కేవలం 230 స్పెషల్ ట్రైన్స్ మాత్రమే నడుపుతోంది.. ఈ లాక్ డౌన్ 5 నెలల కాలంలో,రైళ్లు ఎక్కడా నడపలేదు, ఈ సమయంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ నడపాలి అని రైల్వేశాఖ భావించింది, తాజాగా కేంద్రం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే అన్నీజోన్ల నుంచి ఏ సర్వీసులు అవసరం, అలాగే ఎక్కడ ఎక్కువ రద్దీ ఉంటుందో ఆ రూట్లలో
నడపాలి అని భావిస్తున్నారు, దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ రైళ్ల జాబితా సిద్దం చేస్తున్నారట.దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేపట్టింది.

ప్రత్యేక రైళ్లపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని రైల్వేబోర్డు జోన్లకే అప్పగించింది.ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి ప్రతిరోజు 22 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.మరో 15 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ
హైదరాబాద్ నుంచి తిరుపతికి
సికింద్రాబాద్ నుంచి పట్నాకు,
సికింద్రాబాద్ హౌరాకు
సికింద్రాబాద్–చెన్నై
కాచిగూడ నుంచి బెంగళూరుకు కొత్త సర్వీసులు వేయనున్నట్లు తెలుస్తోంది.