Flash News- హైదరాబాద్ ప్రజలారా బి అలర్ట్..

0
75

హైదరాబాద్ ప్రజలను వాతావరణశాఖ అలర్ట్ చేసింది. నేటి మధ్యాహ్నం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ వెల్లడించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని, అవసరం ఉంటే కంట్రోల్ రూమ్ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. కంట్రోల్ రూం నెం. 0402111 1111. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని..కార్యాలయాలకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కాగా గత రాత్రి కురిసిన వర్షం నుండి భాగ్యనగరం తేరుకోకముందే మరో భారీ వర్ష సూచన ప్రజలను కలవరపెడుతుంది.