సమంత ప్రెగ్నెన్సీపై ఆ నిర్మాత షాకింగ్​ కామెంట్స్..!

That producer's shocking comments on Samantha's pregnancy ..!

0
29

టాలీవుడ్​ స్టార్​ కపుల్​ నాగచైతన్య-సమంత ఇటీవల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో సోషల్​మీడియాలో సామ్​పై పలు పుకార్లు వచ్చాయి. ‘సమంత పిల్లలను వద్దనుకుంది.. అబార్షన్​ కూడా చేయించుకుంది’ ఆ రూమర్స్​లో ఒకటి.

దీనిపై నిర్మాత నీలిమ గుణ ఓ షాకింగ్​ విషయాన్ని తెలిపారు. సామ్​ పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుందని, కానీ రెండు నెలల్లోనే ఏదో జరిగి ఉంటుందని చెప్పారు.శాకుంతలం సినిమా కోసం మా నాన్న (దర్శకుడు గుణశేఖర్​) సమంతను సంప్రదించారు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఫ్యామిలీ ప్లానింగ్​లో ఉన్నట్లు చెప్పింది.

కానీ శాకుంతలం కథ నచ్చడం వల్ల కొన్ని షరతులు విధించి ఒప్పుకొంది. జులై, ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తిచేయాలని కోరింది. మేము దానికి అంగీకరించాం. ఈ చిత్రం తర్వాత విరామం తీసుకుని, తల్లి కావాలని ఆమె కోరుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చైతూ-సామ్​ విడిపోవడం షాకింగ్​గా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.