Protein powder Taking Side Effects: జిమ్‌కు వెళ్లి చెమట చిందించి.. కండలను పెంచటానికి తాపత్రయపడతారు.. దీని కోసం వర్కౌట్లతో పాటు.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల కోసం సప్లిమెంట్స్‌ను వాడుతుంటారు. ఈ ప్రోటీన్ పౌడర్లను వాడటం వల్ల శరీరానికి చేసే మేలు కంటే.. హాని ఎక్కువ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ ద్రవ పదార్థంలో గ్లోబులర్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ద్రవ పదార్థాన్ని జున్న ఉత్పత్తుల బయోప్రొడక్ట్ నుంచి సేకరిస్తారు. అయితే, ఇది శరీరానికి ఏ విధంగా కీడు చేస్తుందో తెలుసుకొని, అప్రమత్తం అవుదాం రండి.
బ్యాలెన్స్ తప్పుతుంది
ప్రోటీన్ పౌడర్ తీసుకోవటం వల్ల శరీరంలో ఉండే పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. ప్రోటీన్ పౌడర్ కేవలం ఎక్కువ మెుత్తంలో శరీరానికి ప్రోటీన్‌ను మాత్రమే అందిస్తుందని గుర్తించుకోవాలి. అందువల్లే.. బాడీలో ఉన్న పోషకాల బ్యాలెన్స్ తప్పుతుంది. గుడ్లు, పాలు, మాంసం వంటి సహజ ప్రోటీన్లను.. ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్‌కు బదులుగా వాడితే.. శరీరంలో పోషకాల అసమతుల్యతను తగ్గించవచ్చు.
విషపూరిత లోహాలు
కొన్నికొన్ని కంపెనీల ప్రోటీన్ పౌడర్‌లో విషపూరిత లోహాలు ఎక్కువుగా ఉంటాయి. వీటి వల్ల తలనొప్పి, మలబద్ధకం, కండరాల నొప్పి, అలసట వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జిమ్ కసరత్తులు చేసేవారు, బాడీబిల్డర్లు, మంచి శరీరాకృతి కోసం కష్టపడే వాళ్లు.. మంచి కంపెనీల నుంచి మాత్రమే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మెుత్తంలో కొనుగోలు చేయకుండా.. శాంపిల్ వాడిన తరువాతే, మీ శరీరతత్వానికి సరిపడితేనే ప్రోటీన్ పౌడర్ (Protein powder) వాడాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇన్సులిన్ పెరుగుతుంది
ప్రోటీన్ పౌడర్ దుష్ప్రభావం కొన్నిసార్లు దీర్ఘకాలికంగా చూపిస్తుంది. క్రమంగా ఇన్సులిన్ స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటుంది. క్రమంగా ప్రోటీన్ పౌడర్ల వాడకంతో శరీరంలోని ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. రెగ్యులర్‌గా ఇన్సులిన్ స్థాయిలో మార్పులు రావటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మెుటిమలు ఎక్కువ అవుతాయి
ప్రోటీన్ పౌడర్లు శరీరంలో సెబమ్ ఉత్పత్తులు పెంచుతుంది. దీనివల్ల మెుటిమల ఎక్కువ అవుతాయని నిపుణులు తెలిపారు. హార్మోన్లు, బయోయాక్టివ్ పెప్టైడ్‌లు ప్రోటీన్ సంప్లిమెంటరీల్లో ఎక్కువ ఉండటం కారణంగానే.. ఈ సమస్య వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు
Read Also: మహిళల మానసిక ఒత్తిడి తగ్గించే 3 సులువైన చిట్కాలు
Follow us on: Google News, Koo, Twitter